AIIMS Bathinda Recruitment | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం పంజాబ్ భటిండాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనస్థీషియాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పల్మనరీ మెడిసిన్, తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 70
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు : ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, ఫార్మకాలజీ, అనస్థీషియాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, పల్మనరీ మెడిసిన్, తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.67700
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 21, 22
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9-10 వరకు.
ఇంటర్వ్యూ వేదిక: రిక్రూట్మెంట్ సెల్, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ బ్లాక్, మెడికల్ కాలేజీ బిల్డింగ్, ఎయిమ్స్ బటిండా
వెబ్సైట్ : https://aiimsbathinda.edu.in/