పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం వేడుకలు అంబరాన్నంటాయి. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేకులు కోసి మిఠాయిలు పంచుకున్నారు. యువత సంబురాల్లో మునిగి తేలారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అర్ధరాత్రి 12గంటలకు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు.