మంచం పట్టిన హన్మాజీపేట్
బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామస్తులు కీళ్లనొప్పులు, జ్వరాలతో మంచం పట్టారు. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒకటి, ఏడు, ఎనిమిది వార్డుల్లోని ప్రజలంతా జ్వరాలతో మంచానికే పరిమితమై..
- కీళ్లనొప్పులు, సీజనల్ వ్యాధుల విజృంభన
- వారంపాటు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినా తగ్గని వ్యాధులు
- ఆందోళనలో గ్రామస్తులు
బాన్సువాడ రూరల్, జూన్ 3: బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామస్తులు కీళ్లనొప్పులు, జ్వరాలతో మంచం పట్టారు. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒకటి, ఏడు, ఎనిమిది వార్డుల్లోని ప్రజలంతా జ్వరాలతో మంచానికే పరిమితమై.. నాణ్యమైన వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు. తీవ్రమైన కీళ్లనొప్పులతో నడవడానికి, కూర్చోవడానికి చాలా ఇబ్బందిపడుతున్నారు. ప్రైవేటు దవాఖానలో వైద్యానికి బాగా ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తంచేశారు. హన్మాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. అయినా కూడా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టలేదు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తపరీక్షలు, నాణ్యమైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కీళ్ల నొప్పులు చాలా ఇబ్బందిపెట్టాయి..
నా కుమారుడు కీళ్లనొప్పులతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. నడవడానికి రాలేదు. నిజామాబా ద్ తీసుకెళ్లి వైద్యం చేయిం చాం. ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. గ్రామంలో వ్యాధులు ప్రబలడం ఆందోళన కలిగిస్తున్నది.
– సాయిబాబా, హన్మాజీపేట్
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశాం
గ్రామంలో చాలా మంది జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడ్డారు. ఈ విషయమై గ్రామస్తులు తమ దృష్టికి తీసుకురావడంతో వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందించాం. అవసరమైన వారికి రక్తపరీక్షలు నిర్వహించాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరోసారి శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందజేస్తాం.
– సాయిలు, హెచ్‌ఈవో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హన్మాజీపేట్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

