ఖలీల్వాడి, జూన్ 7: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్-2024 విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 10న ఆన్లైన్లో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. ఇంటర్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45శాతం మార్కులు, ఇతరులు 50శాతం మార్కులు సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. 01.09.2024 నాటికి 17 సంవత్సరాలు నిండిన వారు http://deecet.telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 6309535759, 9966509891 నంబర్లను సంప్రదించాలని సూచించారు.