ఖలీల్వాడి, మార్చి 18: పదో తరగతి పరీక్షా పత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్లో పంపిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నలుగురిపై వేటు పడింది. ఆలూర్ జడ్పీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రంలో బుధవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఇన్విజిలేటర్ ఒకరు అనుమతి లేకుండా సెల్ఫోన్ లోనికి తీసుకెళ్లి, ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్లో పంపించారు.
ఇది కాస్త బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, కలెక్టర్కు నివేదించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇద్దరు ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.