లింగంపేట్ : స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను ( Sports ) నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్ ( Naragoud) సూచించారు. లింగంపేట్ మండలంలోని మాలోత్ తండాలో గురువారం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ (Sant sevalal Maharaj) జయంతి సందర్బంగా తండాలో నియోజకవర్గ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను (Kabaddi Tourney) ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలు నియోజకవర్గస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు . ఈ సందర్భంగా క్రీడలు ఏర్పాటు చేసిన యువకులకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల్ సింగ్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్, మండల యూత్ అధ్యక్షులు రాజు, రామకృష్ణ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, శివలాల్, తండావాసులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు .