బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయం
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్వగృహంలో మంగళవారం విలేకరుతో మాట్లాడారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించిందని అన్నారు.
- సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి
- ఇతర పార్టీలకు కేడర్ లేదు.. కేడర్ ఉన్నా లీడర్ లేడు
- వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు
- నన్ను గెలిపించినందుకు రూ.11 వేల కోట్లతో బాన్సువాడను అభివృద్ధి చేశా..
- విలేకరుల సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, ఆగస్టు 22 : రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ స్వగృహంలో మంగళవారం విలేకరుతో మాట్లాడారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించిందని అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని పెంచి ప్రజలకు ఏ రకంగా పంచాలో అనేది సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో ప్రస్తుతం మన దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి చూస్తే కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలు శాంతియుతంగా ఉండకుండా చూసే పార్టీ ఒకటి.. మరో పార్టీ అబద్ధపు మాటలు చెప్పి ఆధికారం కోసం పాకులాడుతున్నదని స్పీకర్ పోచారం ఎద్దేశా చేశారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయని, వాటిలో ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్న నాలుగు రాష్ట్రాలు మినహాయిస్తే 23 రాష్ర్టాలను బీజేపీ, కాంగ్రెస్‌లు పాలిస్తున్నాయని తెలిపారు. మరి మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా, రైతు సంక్షే మ పథకాలు ఆయా పార్టీలు పాలించే రాష్ర్టాల్లో ఎందుకు లేవని స్పీకర్ పోచారం ప్రశ్నించారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర వారు సీఎం కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
కర్ణాటకలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చూసి తెలంగాణలో ఆ పార్టీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, రాబోవు ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావని స్పీకర్ పోచారం జోస్యం చెప్పారు. బీఆర్ఎస్కు అసలు రాష్ట్రంలో పోటీయే లేదన్నారు. 2023లోఎన్నికల్లో 103 స్థానాలు గెలుచుకుంటామని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల సహకారంతో పదేండ్లలో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ఖర్చు చేశామన్నారు. కేవలం బాన్సువాడ ము న్సిపాలిటీలోనే రూ. 650 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
బీఆర్ఎస్ తరఫున మళ్లీ పోటీ చేయడానికి అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా స్పీకర్ పదవిలో ఉన్నవారు ఓడిపోతారనే అనే సామెతను తిరగరా స్తానన్నారు. కేసీఆర్ కామారెడ్డి నియోజక వర్గం నుంచి పోటీ చేయడాన్ని హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నామని, కేసీఆర్‌కు కామారెడ్డి నియోజక వర్గంలో అన్ని వర్గాల మద్దతు ఉంటుందని అన్నారు. వారు ఇక్కడికి రావడం ఉభయ జిల్లాల ప్రజల అదృష్టం అన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా 115 శాసనసభా స్థానాలకు పేర్లు ప్రకటించారని, ఇంత ముందస్తుగా పేర్లు ప్రకటించడానికి ధైర్యం, దమ్ము కావాలన్నారు. ఇదంతా కేసీఆర్‌కు ప్రజలు ఇచ్చిన ధైర్యం అని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్, ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఏంఎసీ చైర్మన్ అశోక్, పార్టీ యువజన విభాగం నాయకులు, మున్నూరు కాపు సంఘం నాయకులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

