Nizamabad | ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష.. పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 6,807 మంది అభ్యర్థులకు గాను 20 పరీక్ష కేంద్రాలు కేటాయించారు.
Nizamabad | వినాయక్ నగర్, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 6,807 మంది అభ్యర్థులకు గాను 20 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఈ పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. 6,807 మంది అభ్యర్థులు పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోగా, 6,258 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 549 మంది అభ్యర్థులు గైర్హాజరు అయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
కాగా ఈ పరీక్షను జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ (గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సివల్) పీ రామ్మోహన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్ శుభం ప్రకాష్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీటీసీ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మలేష్, ఐటీ సెల్ సిబ్బంది, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు సీఐలు, ఎస్సైలు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

