తీరొక్కపూల జాతర
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ పూలకించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.
- వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
- ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
- పూలవనాలను తలపించిన పల్లెలు, పట్టణాలు
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ పూలకించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో పల్లెలన్నీ పూలవనాన్ని తలపించాయి. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం

నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 21 : జిల్లాకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు శనివారం జరుపుకొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను మహిళలు అందంగా పేర్చి, ఇండ్ల ఎదుట సాయంత్రం ఉంచి పూజలు చేశారు. అనంతరం గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా ఆడి పాడారు. పండుగలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.


Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

