Pitlam | ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయం.. పిట్లం తహసీల్దార్ మహేందర్
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయమని పిట్లం తహసీల్దార్ మహేందర్ అన్నారు. పిట్లం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.
Pitlam | కామారెడ్డి, ఆగస్టు 6 : ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయమని పిట్లం తహసీల్దార్ మహేందర్ అన్నారు. పిట్లం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మహేందర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మేధోబలాన్ని అందించిన మహనీయుడు అని కొనియాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటి చెప్పి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. నిరాడంబర జీవనం, నిజాయితీ, నిబద్ధతతో సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

