వినాయక నగర్,మార్చి;_28 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. రంజాన్ మాసం కొనసాగుతున్న సందర్భంగా నగరంలోని పలు సున్నితమైన ప్రాంతాల లో తిరుగుతూ ఆయన స్థానికుల ద్వారా పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు మైనారిటీ ఏరియాలో వ్యాపారస్తులతో ఆయన స్వయంగా మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించారు. నిన్న ముస్లింల *Shab e Qadar లో భాగముగా సిపి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని టౌన్ 1, టౌన్ 2 పరిసర ప్రాంతాలలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్నటువంటి Shab e Qadar కార్యక్రమాలలో భాగంగా స్థానిక జామా మసీద్, బర్కత్ పుర కాలనీ, మాలపల్లి, ఆటోనగర్, హైమదీ బజార్ ప్రాంతంలోనీ శంభునిగుడి, గాజులపేట్ ఏరియాలోని గురుద్వారా తదితర ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి యోగ క్షేమాలు తెలుసుకొవడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారిచేయడం జరిగింది.