మేథస్సుకు పదును
చిట్టిబుర్రల్లో మెదిలే ఆలోచనలకు పదునుపెట్టి అద్భుతాలు సృష్టించవచ్చు. చిన్నారుల్లో సైన్స్‌పై జిజ్ఞాసను పెంచేందుకు, నూతన ఆవిష్కరణల రూపకల్పనలను ప్రోత్సహిందుకు విద్యాశాఖ ఏటా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నది. విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్న విజ్ఞానంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల నమూనాలు రూపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదిక కానున్నాయి.
- వైజ్ఞానిక ప్రదర్శనలకు ఆహ్వానం
- జనవరి 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్
కామారెడ్డి, డిసెంబర్ 23: చిట్టిబుర్రల్లో మెదిలే ఆలోచనలకు పదునుపెట్టి అద్భుతాలు సృష్టించవచ్చు. చిన్నారుల్లో సైన్స్‌పై జిజ్ఞాసను పెంచేందుకు, నూతన ఆవిష్కరణల రూపకల్పనలను ప్రోత్సహిందుకు విద్యాశాఖ ఏటా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నది. విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్న విజ్ఞానంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల నమూనాలు రూపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదిక కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి ప్రదర్శనలకు ఆహ్వానం పలుకుతున్నది. 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్ విభాగం, 9 నుంచి పదోతరగతి వరకు సీనియర్ విభాగంలో తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు.
సృజనాత్మకతకు దోహదం..
విద్యార్థులు ఉపాధ్యాయుల మార్గదర్శకంలో వివిధ రకాల ప్రాజెక్టులను రూపొందించి నిత్యం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉన్నది. సైన్స్ ఫెయిర్‌లో భాగంగా విద్యాశాఖ ప్రతి ఏడాది ఒక అంశాన్ని ఎంపిక చేస్తుంది. అందుకనుగుణంగా విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించనున్నారు. ఈ ఏడాది సైన్స్ టెక్నాలజీ ఫర్ సొసైటీ అనే అంశాన్ని ప్రధానంగా ఎంచుకున్నారు. ఉప అంశాలుగా ఆరోగ్యం, లైఫ్ ైస్టెల్ ఫర్ ఎన్విరాన్మెంట్, వ్యవసాయం, కమ్యూనికేషన్, ట్రాన్స్‌పోర్టు, కంప్యూటర్ థింకింగ్ అనే వాటిపై విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేయాల్సి ఉంటుంది. వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులతోపాటు పాఠశాల నుంచి ఒక గైడ్ టీచర్ కూడా హాజరుకావొచ్చు.
జనవరి 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్..
వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు జనవరి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 18,19వ తేదీల్లో జిల్లాస్థాయి ప్రదర్శనలు చేసేందుకు గూగుల్ ఫాం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ముందుగా పాఠశాల, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించి ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని జాతీయస్థాయికి పంపిస్తారు. జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో చదివే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హులు.
ప్రతిభను వెలికితీసేందుకే..
విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయి. 6,7,8వ తరగతి జూనియర్ విభాగంలో, 9,10వ తరగతి విద్యా ర్థులు సీనియర్ విభాగంలో పాల్గొని తమ ప్రతిభను చాటాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు 94404 14250 సంప్రదించాలి.
– సిద్ధిరాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, కామారెడ్డి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

