ఏసీబీ వలలో అవినీతి చేప
తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
- కారు అద్దె బిల్లు మంజూరుకు డీఈఐఈ రూ.9 వేలు డిమాండ్
- అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించిన బాధితుడు
- డీపీఆర్వో కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వైనం..
- కేసు నమోదు.. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు
నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 19 : తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. గురువారం మధ్యాహ్నం సమయంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ఉన్న డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ (జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ)పై ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో ఇతర శాఖల అధికారులు అయోమయానికి గురయ్యారు. బాధితుడు, అవినీతి నిరోధక శాఖ డీజీ(డైరెక్టర్ జనరల్) తెలిపిన మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన కోనేటి విజయ్ కుమార్ అనే వ్యక్తి తన కారును డీపీఆర్వో కార్యాలయంలో డిప్యూటి ఎగ్జిక్యూటీవ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సి.వేణి ప్రసన్న అనే అధికారిణి వద్ద అద్దెకు పెట్టాడు. ఆమె తన డ్యూటీలో భాగంగా నిత్యం కారును వాడుకునేది. అందుకు గాను ప్రతి నెలా రూ.33 వేల అద్దె అగ్రిమెంట్ చేసుకున్నారు.
కారుకు మూడు నెలల నుంచి బిల్లులు రాలేదు. తనకు ఆఫీస్ నుంచి రావాల్సిన రూ.99 వేల బిల్లు మంజూరు అయ్యేలా చూడాలని విజయ్ కుమార్.. వేణి ప్రసన్నను కోరాడు. దీంతో మూడు నెలల బిల్లులకు గాను నెలకు రూ.3 వేల చొప్పున రూ.9 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయంగా రావాల్సిన డబ్బులకు లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు ఇచ్చిన సలహా మేరకు గురువారం లంచం డబ్బులు అధికారిణికి ఇచ్చేందుకు డీపీఆర్వో ఆఫీస్‌కు వెళ్లాడు. అప్పటికే మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు జిల్లాల అధికారులు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద నిఘా పెట్టారు. విజయ్ కుమార్ రూ.9వేలు లంచం డబ్బులను డీఈఐఈ వేణి ప్రసన్నకు ఇవ్వగానే దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారిణిపై కేసు నమోదు చేసి, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఈ దాడిలో నిజామాబాద్ జిల్లా ఏసీబీ ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్, మెదక్ జిల్లా ఇన్స్పెక్టర్లు వెంకట రాజ గౌడ్, రమేశ్‌తో పాటు రెండు జిల్లాల సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుపేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు అభినందనీయం’
‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
Priya Bhavani Shankar | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ శంకర్.. ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం!
Man Kills Wife, Strips Body | భార్యను హత్య చేసి దుస్తులు తొలగించిన భర్త.. హత్యాచారంగా నమ్మించేందుకు యత్నం
Ramayana | థాయ్‌లాండ్‌లో రూ.5 కోట్లు.. ఇండోనేషియాలో దూసుకుపోతున్న ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

