Velama Association | కంఠేశ్వర్, అక్టోబర్ 4 : నిజామాబాద్ జిల్లా వెలమ సంఘంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన నిజామాబాద్ జిల్లా వెలమ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా ముగిసాయి. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ లో మిగిలారు. దీంతో పోటీ లేకుండానే అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతన కార్యవర్గానికి ధృవీకరణ పత్రాలను అధికారికంగా అందజేశారు. వెలమ బంధువులందరూ ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవానికి సహకరించడం పట్ల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
మాజీ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు అభినందన
ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు హాజరై నూతన కమిటీని అభినందించారు. వేదికపై బీరెల్లి రమణా రావు, అవంతి రావు, ఉమాపతి రావు, శ్రీనివాసరావు, భీమ్రావు తో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన వెలమ ప్రముఖులు, పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుల బంధువుల ఐక్యతే బలం అని, నూతన కమిటీ సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు.
నూతన అధ్యక్షుడిగా బల్గూరి రాజేశ్వర్రావు
జిల్లా అధ్యక్షులుగా న్యాల్కల్ గ్రామానికి చెందిన సుదీర్ఘ అనుభవం ఉన్న బల్గూరి రాజేశ్వర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మెట్పల్లి గ్రామానికి చెందిన బీరెల్లి విజయరావు ఎన్నికయ్యారు.
కార్యవర్గం
అధ్యక్షుడు : బల్గూరి రాజేశ్వర్ రావు (న్యాల్కల్ గ్రామం)
ప్రధాన కార్యదర్శి : బీరెల్లి విజయరావు (మెట్పల్లి)
ఉపాధ్యక్షులు (3) : పడకంటి పోతన్ రావు(బాద్గుణ), వొక్కెర్ల నర్సింగ్ రావు(నారాయణపూర్), కిష్టగారి సమత మంజిత్ రావు (మాదాపూర్)
కోశాధికారి : మార్నేని పాపేశ్వర్ రావు(నిజాంపూర్)
సంయుక్త కార్యదర్శులు : భూపాల్ శ్రీనివాసరావు(నిజామాబాద్), గంటన్నగారి బాలకిషన్ రావు (మాదాపూర్), న్యాల్కల్ లత రాజేశ్వర్ రావు (వల్లభాపూర్).
25 మంది డైరెక్టర్లతో విస్తృత కార్యవర్గం ఏర్పాటు
నందిగాం నుండి కోస్లి కిషన్ రావు
మద్దేపల్లి నుండి మిరియాల రవికుమార్ రావు
పోతంగల్ నుండి న్యాలకంటి శ్రీనివాసరావు
తుంగిని నుండి బీర్కూర్ ఉమాదేవి
నిజాంపూర్ నుండి పాపయ్యోల్ల లింగారావు
నారాయణపూర్-1 నుండి వొక్కెర్ల ప్రవీణ్ రావు
జన్నపల్లి-2 నుండి బట్టు హరీశ్ రావు
మాధాపూర్ 1,2,3 ల నుండి వరుసగా కే. రాజేశ్వర్ రావు, మాక్లూర్ రామారావు, బొంతల వనిత
మాక్లూర్ నుండి సిర్నాపల్లి స్వరూప రాణి
ముల్లంగి నుండి వై. వెంకట సంజీవరావు
బొంకన్పల్లి నుండి కే. వెంకటేశ్వర్ రావు
మెట్పల్లి నుండి ఎస్. కరుణాకర్ రావు
చిమరాజ్పల్లి నుండి మాక్లూర్ రమణారావు
న్యాల్కల్ 1,2 ల నుండి సతీష్ రావు, కంటెగారి అశ్విని
నిజామాబాద్-1 నుండి తన్నీరు కృష్ణారావు
బాసర్ నుండి నర్సూరి శిరీషా
బాన్సువాడ నుండి కే పవన్ కుమార్ గార్లు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.
ఇలా ఉండగా నాలుగు చోట్ల నారాయణపూర్-2, జన్నపల్లి-1, వెంకటాపూర్, సీహెచ్ కొండూర్, నికాల్పూర్-బాద్గుణ-ఉమ్మెడ ప్రాంతం, నిజామాబాద్-2లో మహిళా/జనరల్ నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉంచారు.
ఏకగ్రీవం వెనుక ఐక్యత
ఎన్నికలు అంటేనే విభేదాలు వస్తాయి. కానీ నిజామాబాద్ వెలమ సంఘం అందుకు భిన్నంగా అందరినీ కలుపుకుని ఏకగ్రీవం చేసి ఐక్యతను చాటుకుంది. నూతన కమిటీ వెలమ బంధువుల సంక్షేమం, విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని, యువతను ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా పెద్దలు సూచించారు.