ప్రాణాల మీదకు తెచ్చిన భూ వివాదం
ఓ భూవివాదంలో సర్పంచ్ ఇంటిపై దాడిచేసిన ఘటన మండలంలోని సోమారం తండాలో చోటు చేసుకున్నది. సోమారం తండాకు సర్పంచ్ కిషన్ నాయక్ ఇంటిపై కొత్తబాది తండాకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దాడిచేశారు.
- సోమారం తండా సర్పంచ్ ఇంటిపై దాడి
- కుటుంబ సభ్యులకు గాయాలు .. పోలీసులకు ఫిర్యాదు
- తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించడంలేదని కొత్తబాది తండాకు చెందిన దంపతుల ఆరోపణ
- ఆత్మహత్యా యత్నం.. దవాఖానకు తరలింపు
గాంధారి, నవంబర్ 25: ఓ భూవివాదంలో సర్పంచ్ ఇంటిపై దాడిచేసిన ఘటన మండలంలోని సోమారం తండాలో చోటు చేసుకున్నది. సోమారం తండాకు సర్పంచ్ కిషన్ నాయక్ ఇంటిపై కొత్తబాది తండాకు చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దాడిచేశారు. ఇందుకు సంబంధించి స్థానికులు, ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని చద్మల్ రోడ్డు పక్కన కిషన్‌నాయక్ పేరు మీద ఉన్న రెండు గుంటల భూమిని 2011 సంవత్సరంలో కొత్తబాది తండాకు చెందిన శంకర్‌కు విక్రయించారు. ఇందుకుగాను రూ. 4.5 లక్షలు అడ్వాన్సుగా శంకర్ ఇచ్చాడు. మిగతా రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శంకర్‌కు కిషన్‌నాయక్ సూచించారు. ఈ విషయంలో జాప్యం జరగడంతో దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు సైతం నిర్వహించారు. శుక్రవారం కిషన్‌నాయక్ ఇంటిపై శంకర్‌నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి దాడిచేశారు.
సర్పంచ్ కిషన్‌నాయక్, అతని భార్య బూలీనితోపాటు మార్గమధ్యంలో ఆయన కొడుకు రవిపై కూడా దాడికి పాల్పడారు. దీంతో కిషన్‌నాయక్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకొన్నారు.ఇదిలా ఉండగా తాము కొనుగోలు చేసిన రెండు గుంటల భూమికి డబ్బులు చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించకుండా కిషన్‌నాయక్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ శంకర్, అతని భార్య సునీత పురుగుల మందు తాగినట్లు ఎస్సై వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట్‌కు తరలించినట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

