బాల్కొండ, డిసెంబర్ 28 : గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఆపడం సరికాదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మ రింత బాధ్యతగా సేవలందిస్తానన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. వేడుకల్లో అధికారులు పాల్గొనే స్ఫూర్తి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిందని, ప్రస్తుతం ఆ స్ఫూర్తిని పక్కన పెట్టడం సరైంది కాదన్నారు.
ఫొటోలు పెట్టకుం డా ప్రొటోకాల్‌ను విస్మరించారని, ఫొటోలు పెట్టనంత మాత్రాన తనకేమీ ఇబ్బంది లేదన్నారు. ప్రజల మనస్సుల్లో తానున్నానన్నారు. గత ప్రభు త్వ హయాంలో ఎస్డీఎఫ్ నుంచి మసీదులు, ఆలయాలు, సంఘ భవనాలు తదితర అభివృద్ధి పనులకు చేయించిన మంజూరీలను ఆపాలని ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తున్నదని,అభివృద్ధి పనులను యథావిధిగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను కోరారు. ఎంపీ పీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు, నియోజకవర్గ క్రిస్టియన్ డెవలప్మెంట్ ఫోరం, క్రైస్తవ పాస్టర్ల అసోసియేషన్, అంతర్జాతీయ స్పీకర్ డాక్టర్ జాన్ వెస్లీ పాల్గొన్నారు.