Dharpally | స్ఫూర్తి సభను విజయవంతం చేయాలి.. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ జగన్
కేసీఆర్ దీక్ష దివాస్‌ను పురస్కరించుకొని మండల కేంద్రంలో రూరల్ పరిధిలోని ఏడు మండలాలకు సంబంధించి ఆదివారం నిర్వహించనున్న స్ఫూర్తి సభతో పాటు, మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాజిరెడ్డి జగన్ పిలుపునిచ్చారు.
Dharpally | ధర్పల్లి, నవంబర్ 28 : కేసీఆర్ దీక్ష దివాస్‌ను పురస్కరించుకొని మండల కేంద్రంలో రూరల్ పరిధిలోని ఏడు మండలాలకు సంబంధించి ఆదివారం నిర్వహించనున్న స్ఫూర్తి సభతో పాటు, మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాజిరెడ్డి జగన్ పిలుపునిచ్చారు. ధర్పల్లి మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచి ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అయితే పూర్తి సభకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతోపాటు రూరల్ లోని ఏడు మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఉచిత వైద్య శిబిరాన్ని చేసుకోవాలి
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఉచిత వైద్య శిబిరాన్ని సైతం మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. శిబిరంలో స్త్రీల సంబంధించిన వైద్య నిపుణులు, గుండె, ఊపిరితిత్తులు, సాధారణ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిచనున్నట్లు వారు తెలిపారు. అవసరమైన పరీక్షలు సైతం ఉచితంగానే చేసి అవసరమైన వారికి మందులు అందజేస్తామని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, జిల్లా నాయకులు పీసు రాజుపాల్ రెడ్డి, నాయకులు నల్ల హనుమంత్ రెడ్డి, రామడుగు సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, నాయకులు అబ్దుల్ మజీద్, బద్దం నడిపి గంగారెడ్డి, నజీర్, గంగారెడ్డి, మహిపాల్, రవి, తోపారం మోహన్, శంకర్ నాయక్, క్రాంతి గౌడ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

