స్వరాష్ట్రంలో మన ఆలయాలకు మంచి రోజులు వచ్చాయి. స్వతహాగా ఆధ్యాత్మికపరుడైన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. అధ్యాత్మికంగా, పర్యాటకంగా పేరొందిన ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లా డిచ్పల్లి రామాలయ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖిల్లా రామాలయంలో పర్యాటక సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు రూ.4.61కోట్లతో ఆలయానికి ఎదురుగా ఉన్న ఎకరం స్థలంలో సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా పర్యాటక శాఖ అధికారులు ఇటీవల ఖిల్లా రామాలయాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. గ్రామస్తులు ఎక రం స్థలం ఇచ్చేందుకు టూరిజం శాఖ అధికారులకు అంగీకార పత్రాన్ని సైతం అందజేశారు.
పురాతన వారసత్వ సంపద కలిగి పర్యాటకంగా ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉమ్మడి పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మంచి రోజులు వచ్చాయి. ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యంవంటి పథకాలతో నవశకం ఆరంభం కాగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టనున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని చారిత్రక నిలయమైన ఖిల్లా డిచ్పల్లి రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. రూ.4.61కోట్లతో ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
– డిచ్పల్లి, జనవరి 4
ఆహ్లాదకర వాతావరణం..
ఖిల్లా రామాలయానికి ఆనుకొని పెద్ద బురు జు, కోనేరు, పక్కనే నిండుకుండలా చెరువు నీటితో కళకళలాడుతున్నది. సాయంత్రం వేళ ఖిల్లా రామాలయం.. సందర్శించే పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరాన్ని పంచుతున్నది. సాయం త్రం వేళల్లో పర్యాటకులు రామాలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. ఉదయం, సాయంత్రం రామాలయంపై పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇది వరకే రామాలయంపై చుట్టూరా ఫెన్సింగ్తోపాటు రాతికట్టడాన్ని ఏర్పాటు చేశారు. కల్యాణ వేడుకలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం కుడిభాగం వైపున స్లాబును సైతం ఏర్పాటు చేయడంతో సుమారు 500 మంది భక్తులు కల్యాణ వేడుకలను తిలకించే అవకాశం కలుగుతున్నది.
ఎకరం స్థలంలో నిర్మించే సౌకర్యాలు..
సమాచార కేంద్రం, వెయిటింగ్ హాల్, బాత్రూమ్లు, తాగునీటి వసతి, చెప్పులు భద్రపరిచే గది, ప్రసాదం కౌంటర్, ప్రాథమిక చికిత్స కేంద్రం, సామాన్లు భద్రపరుచు గది, క్యాంటీన్, ఏటీఎం, స్టాల్స్, సిట్టింగ్ బెంచీలు, మల్టీపర్పస్ హాల్, వాహనాల పార్కింగ్, సోలార్ విద్యుత్ ప్యా నల్, వర్షపు నీటి నిల్వ, చెత్తాచెదారం వేసేందుకు కుండీల ఏర్పాటు, ప్రహరీ, సీసీటీవీల ఏర్పాటు వంటి సౌకర్యాలను కల్పించనున్నారు.
పర్యాటక కేంద్రంగా మారనున్న ఖిల్లారామాలయం..
రాష్ట్ర ప్రభుత్వం ఖిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయడం అభినందనీయం. రానున్న రోజుల్లో ఖిల్లా రామాలయం పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో ఆలయానికి మహర్దశ పట్టన్నునది. గ్రామస్తులు, ఈ ప్రాంతవాసుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-ఆసది రవీందర్, ఇన్చార్జి సర్పంచ్, ఖిల్లా డిచ్పల్లి
ఎకరం స్థలాన్ని కేటాయించాం…
ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర పర్యాటక శాఖ ఖి ల్లా రామాలయాన్ని ఎంపిక చేయడం శుభపరిణామం. ఇటీవలే సంబంధిత అధికారులు ఖిల్లా రామాలయాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. అందుకు అవసరమయ్యే ఎకరం స్థలాన్ని ఆలయానికి ఎదురుగా కేటాయించాం. నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను టూరిజం శాఖ అధికారులకు పంపించాం. త్వరలోనే నిధులు
మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.
పర్యాటక క్షేత్రంగా బాసిల్లుతుంది..
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నిలయం ఖిల్లా డిచ్పల్లి రామాలయం. భవిష్యత్తులో ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా బాసిల్లుతుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు ఖిల్లా రామాలయా న్ని సందర్శిస్తూ ఆలయ పూర్వ చరిత్రను తెలుసుకుంటున్నారు. ఏటా రామాలయంపై రెండుసార్లు బ్ర హ్మోత్సవాలు జరగడం విశేషం. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరుకానుండడం సంతోషకరం.
-సుమిత్ దేశ్పాండే, ఆలయ ప్రధాన అర్చకుడు