నింబాచలానికి బ్రహ్మోత్సవ శోభ
గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత్ర. భీమ్‌గల్ మండల పరిధిలోని ఈ పుణ్యక్షేత్రం కాలక్రమేణా లింబాద్రిగుట్టగా ప్రసిద్ధి చెందింది.
- భక్తుల కొంగు బంగారం లక్ష్మీనారసింహుడు
- నేటి నుంచి లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు
భీమ్‌గల్, నవంబర్ 17 : గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది. దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత్ర. భీమ్‌గల్ మండల పరిధిలోని ఈ పుణ్యక్షేత్రం కాలక్రమేణా లింబాద్రిగుట్టగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కొంగుబంగారంగా అలరారుతున్న స్వామివారి బ్రహోత్సవాలు నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి నిత్య కైంకర్యాలతోపాటు బ్రహ్మోత్సవాలను నంబి వంశస్థులు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ధర్మకర్తగా నంబి లింబాద్రి వ్యవహరిస్తున్నారు.
కమల పుష్కరిణి..
కొండపై ఉన్న కమల పుష్కరిణి పూర్తిగా రాతి కట్టడంతో సుందరంగా ఉంటుంది. ఇందులోని నీటిని స్వామివారి పూజా కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తారు. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా కమల పుష్కరిణిలో చక్రస్నానం వేడుకను వైభవంగా నిర్వహిస్తారు.
మంత్రి వేముల చొరవతో అభివృద్ధి..
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులను గతంలో చెక్క రథంపై ఊరేగించేవారు. అది శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో ఇనుప రథాన్ని చేయించారు. గతంలో కొండకు రావడానికి రవాణా సౌకర్యం అంతంత మాత్రంగానే ఉండేది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. రూ. 2కోట్ల 60లక్షలతో కొండపైకి నాలుగు వరుసల రోడ్డు, సెంట్రింగ్ లైటింగ్, గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేకంగా రోడ్డును నిర్మించారు. దీంతో భక్తులకు సౌకర్యవంతంగా మారడంతోపాటు గుట్ట ప్రాంతం మరింత సుందరంగా మారింది. భక్తులు కేవలం జాతర సమయంలోనే పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. ప్రస్తుతం ప్రతి శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి పెరిగింది.
గ్రామదేవతలకు సారె..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తరఫున గ్రామదేవతలకు శుక్రవారం ఆలయ అర్చకులు సారెను సమర్పించారు. మేళ తాళాలతో వెళ్లి పెద్దగంటి ఎల్లమ్మ, పోచమ్మకు సారెను అందించారు.
రోజువారీ కార్యక్రమాలు
18న కొండపైకి ఉత్సవ మూర్తుల పయనం
19న దీపారాధన, రక్షాబంధనం, విష్ణు పంచకం, అంకురార్పన, మృత్యుసంగ్రహణం, అంకురార్పనం, గరుడ పటాధివాసం, ధ్వజారోహణం, శ్రవణ ప్రయుక్త క్షీరాభిషేకం
20న నృసంహ ఏకాక్షరి హవనం
21న సాయంత్రం 5గంటలకు శ్రీవారి ఎదుర్కోలు
22న మధ్యాహ్నం 12.30 గంటలకు స్వామివారి కల్యాణం
23న సర్వేషాం ఏకాదశి, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నృసింహ ఏకాక్షర హవనం, గీతా హవనం, గరుడ సేవ
24న ఉత్థాన ద్వాదశి, తులసి వివాహం, కొండ ప్రదక్షిణ
25న వైకుంఠ చరుర్థి, ధాత్రిమూలే నృసింహ పూజ, ధాత్రి హవనం, డోలారోహనణం
26న చతుర్ధశి ఉపరి పూర్ణిమ, జాతర, రథోత్సవం
27న శేషహోమం, స్నపన తిరుమంజనం, భాగవత ఫలశృతి, పూర్ణాహుతి, పుష్పయాగం
28న దేవతోద్వాసనం, ధ్వజారోహణం, ఉద్వాసన బలిప్రదానం, కొండబలి, డోలోత్సవం, గ్రామాలయానికి ఉత్సవ మూర్తుల పయనం
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

