నగరశివారులో చిరుత సంచారం!
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్ కింద ఓ బండరాయిపై చిరుత ఉండడాన్ని గమనించిన కాలనీవాసులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు.
- సెల్ఫోన్లో చిత్రీకరించిన స్థానికులు
- గాలింపు చర్యలు చేపట్టిన అటవీశాఖాధికారులు
వినాయక్‌నగర్, జూలై 13: నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్ కింద ఓ బండరాయిపై చిరుత ఉండడాన్ని గమనించిన కాలనీవాసులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. కొందరు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
చిరుత సంచారం విషయం తెలుసుకున్న నిజామాబాద్ నార్త్ ఎఫ్ఆర్వో సంజయ్ గౌడ్ తమ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్ సాయంతో చిరుత కోసం 300 క్వార్టర్స్ ఏరియాలోని పరిసర ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో ఎవరూ ఇండ్లలో నుంచి బయటికి రావొద్దని ఎఫ్ఆర్వో సంజయ్ గౌడ్ సూచించారు.
ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో..
ఏడాది క్రితం సైతం నాగారం శివారులోని ఇదే ప్రాంతంలో ఇండ్లకు దగ్గరలో ఓ బండరాయి పై చిరుతను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చా రు. చిరుత సంచారం దృశ్యాలను కొందరు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా అవిసామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

