Kamareddy| త్వరలోనే బీసీ బంధు పథకం
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

బిచ్కుంద : ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు త్వరలోనే బీసీ బంధు పథకం అమలు చేయనున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. గురువారం బిచ్కుంద మండలకేంద్రంలో కమ్మరి చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన అనంతరం ఏర్పటు చేసిన గంగాపుత్ర కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న దళితులుఆర్థికంగా ఎదిగేందుకు ఉద్ధేశించిన దళిత బంధుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో జుక్కల్ నియోజక వర్గం నిజాంసాగర్ మండలాన్ని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో బీసీలకు కూడా బీసీ బంధు పథకాన్ని ప్రవేశ పెడతామని సీఎం పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలో గంగపుత్ర కులస్తులకు చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి చేప పిల్లలను పంపిణీ చేస్తుందని, వాటిని విక్రయించుకోవడానికి ద్విచక్రవాహనాలను కూడా అందించిందని తెలిపారు. గంగపుత్రులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయని దీంతో చెరువులపై ఆధారపడ్డ రైతులు, గంగపుత్రులు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌పటేల్, జడ్పీటీసీ భారతిరాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

