పెద్ద కొడప్గల్(జుక్కల్) : కౌలాస్ కోట (Kaulas fort) అందాలు, కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ (Kamareddy SP) సింధు శర్మ (Sindu Sharma) అన్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ దేవాలయం, కౌలస్ కోటను ఆదివారం ఆమె సందర్శించారు. కోటలో మూడు గంటల పాటు తిరిగి పురాతన నిర్మాణాలు, మందిరాలను, కట్టడాలను పరిశీలించారు.
కోటలో మూడు గంటల పాటు కలియ తిరిగి, తొమ్మిది గజాల ఫిరంగి, హనుమాన్ మందిరం, రామాలయం, సరస్వతి మాత, వెంకటేశ్వరా మందిరం,పట్టే మంచం, తామర కొలను, మల్లికా బురుజు, ఆయుధాగారాలు, ధాన్యగారాలు, కంధకాలు, తదితర వాటిని పరిశీలించారు. కోట వెలుపల ఉన్న అష్ట భుజ మాత మందిరాన్ని సందర్శించి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమె వెంట కామారెడ్డి ఏఎస్పీ , ట్రైనీ ఐపీఎస్, బాన్సువాడ, ఎల్లారెడ్డి డీఎస్పీలు, బిచ్కుంద సీఐతో పాటు ఇతర సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.