గాంధారి : 34వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే కామారెడ్డి (Kamareddy) జిల్లా కబడ్డీ బాల, బాలికల జట్లను( Kabaddi Teams) శుక్రవారం గాంధారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేసినట్లు కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్(Venkateshwar Goud) తెలిపారు.
శుక్రవారం అండర్ 16 జట్ల ఎంపిక పోటీలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని, వీరిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బాల బాలికలను కామారెడ్డి జిల్లా జట్లకి ఎంపిక చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు, ఈనెల 20 నుంచి వికారాబాద్ (Vikarabad) జిల్లా కేంద్రంలో జరిగే పాల్గొననున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బానాల భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్ రాథోడ్, రాజు, సంజీవ్, బాలకృష్ణ, అశ్విని, నిరంజన్ తదితరులున్నారు.
జిల్లా జట్టుకు ఎంపికైన బాలుర జట్టు : అర్జున్, డోలోజి, సాయికిరణ్, అరుణ్, గణేష్, మధు, ప్రణీత్, నితీష్, మహేందర్, రామ్ చరణ్, దీపక్, శశిన్ కుమార్.
బాలికల జట్టు: ఉష, కీర్తన, రిషిక, నవ్య శ్రీ, అశ్వింత, హారిక, షరోన్, ఆరాధ్య, ప్రియాంక, అస్మిత, వర్షిత, అంజలి ఎంపికైనట్లు తెలిపారు.