వినాయక నగర్ (నిజామాబాద్) : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ( Drunk and driving,) తనిఖీలలో 17 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 17 మంది వాహనదారులకు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జాహన్ (Nurjahan) ఎదుట హాజరు పరిచారు.
వీరిలో ఆరుగురికి జైలు శిక్ష విధించడంతో పాటు మిగతా 11 మందికి రూ.15,500 జరిమానా విధించారు. జైలు శిక్ష పడిన వారిలో ఖానాపూర్‌కు చెందిన టి సంతోష్, షేక్ సైదుల్, అనిల్, సిర్నపల్లికి చెందిన అనిల్ , నిజామాబాద్‌కు చెందిన విఠోబా, నివాసం, డిచ్పల్లికి చెందిన షేక్ ఇమామ్ అలీకి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. వాహన దారులు మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరించారు.