Hangarga | ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు.. నిరసనగా హంగర్గ గ్రామ పంచాయతీకి తాళం వేసిన పాలకవర్గం
పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామపంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై హంగర్గ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారని, ఇందుకోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ మంగళవారం కార్యదర్శిని నిర్బంధించి కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు.
Hangarga | పోతంగల్, అక్టోబర్ 13 : పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామపంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై హంగర్గ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారని, ఇందుకోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ మంగళవారం కార్యదర్శిని నిర్బంధించి కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. సంబంధిత కార్యదర్శికి సోమవారం బదిలీ అయినట్లు తెలిసిందని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ మంగళవారం ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి, తమకు తెలియకుండా మరికొందరికి ఇంటి నంబర్ల కోసం రసీదులు జారీ చేశారని ఆరోపించారు.
బదిలీ అయిన వ్యక్తి ఏ హోదాలో రసీదులు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారంలో తమకు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యదర్శి తీరుపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. గ్రామపంచాయతీ వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల జారీపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి వివరణ ఇచ్చే వరకు కార్యాలయానికి వేసిన తాళం తీయబోమని స్పష్టం చేస్తూ అక్కడే బైఠాయించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

