ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ పండుగను సోమవారం జరుపుకొన్నారు. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి.
చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు రంగుల్లో మునిగితేలారు. చిన్నాపెద్దా కలిసి ఆడిపాడుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ డ్యాన్స్ చేశారు.