ఏర్గట్ల/నవీపేట, జనవరి 13: రైతులు ఆయిల్‌పామ్ పంట సాగు చేసి అధిక లాభాలు పొందాలని భీంగల్ ఏడీఏ మల్లయ్య, ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వారు ఆయిల్‌పామ్ పంట సాగుపై శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్, ఎంపీటీసీ సభ్యుడు జక్కని మధుసూదన్, సొసైటీ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు లింగరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అంజయ్య, ఎంపీడీవో కర్నె రాజేశ్, ఏఈవోలు, తదితరులు పాల్గొన్నారు.
నవీపేట మండలంలోని మట్టయ్యఫారం ఆయిల్‌పామ్ పంటను వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఎంపీపీ సంగెం శ్రీనివాస్ పరిశీలించారు. వ్యవసాయ శాఖ మండల అధికారి సురేశ్‌గౌడ్ రైతులకు పలు సూచనాలు చేశారు. సర్పంచ్ రాము, ఏఈవోలు వినోద్, వసంత్, ప్రశాంత్, సుప్రియ, ఉద్యన అధికారి వహీద్, కంపెనీ ప్రతినిధి నవీన్, రైతులు పాల్గొన్నారు.