కంఠేశ్వర్, ఏప్రిల్ 1: జాతీయ స్థాయి సబ్ జూనియర్ (బాలిక విభాగం) సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు అద్భు త ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఉన్న ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు పోటీలు నిర్వహించగా.. మన రాష్ట్ర బాలికల జట్టు ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు పై 08-02 పాయింట్ల తేడాతో విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు కె.సోని (రాష్ట్ర జట్టు కెప్టెన్),ఎం గంగోత్రి, డి.లిఖిత, బి.నిశిత, కే.సౌజన్య, కే.సంహిత అద్భుత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు అందుకున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, మర్కంటి గంగామోహన్ సోమవారం తెలిపారు. గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులను అభినందించారు.