Gandhari | గాంధారి : గాంధారి మండలంలోని చిన్నమల్లారెడ్డిలోని చైతన్య విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థి పీ నిఖిల్ 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో అండర్-12 విభాగం 60 మీటర్ల పరుగులో అదే పాఠశాలకు చెందిన ఎస్. విజయేందర్ అండర్-16 హైజంప్ విభాగంలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు.
కాగా ఈ విషయాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రవీందర్ రావు, అనిల్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థులు మరింత ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తేవాలనని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోనేబోయా ఆనందరావు ఆకాంక్షించారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.