Gampa Govardhan | భిక్కనూరు , జూలై 25 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పురోగతిపై శనివారం BRS కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూరు మండల స్థాయి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా EF ఫామ్‌ల డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలించారు. ప్రస్తుతం మండలంలో 99 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని, మిగిలిన ఫామ్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదయ్యేలా, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, వివరాల సవరణలో పార్టీ కార్యకర్తలు BLOలకు సహకరించాలని నిర్ణయించారు. ప్రతీ బూత్‌లో 100 శాతం లక్ష్య సాధనకు ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.