హరితహారం వ్యథ భరితం
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలనే కృతనిశ్ఛయంతో 2015లో మొదలైన హరితహారం కార్యక్రమ లక్ష్యం ప్రభుత్వం మారడంతో నీరుగారుతున్నది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో ఎటు చూసినా కళావిహీనమైన దుర్భర పరిస్థితులే గోచరిస్తున్నాయి.
- నిర్వహణ లేక ఎండిపోతున్న మొక్కలు
- నీళ్లు లేక, రక్షణ చర్యలు కరువై కళావిహీనం
- పచ్చదనం పరిరక్షణలో అడుగడుగునా లోపాలు
- స్పెషల్ ఆఫీసర్ల తీరుతో గ్రామాల్లో పాలన గాలికి
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలనే కృతనిశ్ఛయంతో 2015లో మొదలైన హరితహారం కార్యక్రమ లక్ష్యం ప్రభుత్వం మారడంతో నీరుగారుతున్నది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో ఎటు చూసినా కళావిహీనమైన దుర్భర పరిస్థితులే గోచరిస్తున్నాయి. గతంలో విజయవంతంగా అమలైన మొక్కల పెంపకం ఇప్పుడు గాలికి వదిలేసినట్లుగా మారింది. హరితహారం కోసం గ్రామాల్లో ట్రాక్టర్, నీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక వ్యవస్థను తీర్చిదిద్దగా ఇప్పుడంతా డొల్లగా మారింది. మండుటెండల్లో తడి లేక మొక్కలన్నీ ఎండిపోతున్నా స్పందించే వారు కరువయ్యారు. రక్షణ చర్యలు కూడా లేకపోవడంతో పశువులకు మేతగా మారిపోతున్నాయి. గతంలో కోట్లాది మొక్కలను నాటగా గ్రామాల్లో దారి పొడవునా స్వాగత తోరణాలుగా దర్శనం ఇచ్చిన చెట్లు బోసిపోతున్నాయి. పట్టణాలు, నగరాల్లోనూ ఇదే దుస్థితి నెలకొన్నది. స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ స్థాయి అధికారిని ప్రభుత్వం గతంలో నియమించింది. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రయత్నం చేయగా పర్యవేక్షణ లోపంతో నిజామాబాద్ జిల్లాలో ఎటు చూసినా మొక్కలన్నీ మోడుబారి దర్శనం ఇస్తున్నాయి. పంచాయతీ శాఖ పర్యవేక్షణ లోపాన్ని ప్రస్ఫుటంగా తేటతెల్లం చేస్తున్నది.
-నిజామాబాద్, మే 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పార్కులు, ఖాళీ ప్రదేశాలు, రోడ్డుకు ఇరువైపులా హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటారు. ఇందులో గత ప్రభుత్వం చర్యలతో కొన్ని బతికి ఏపుగా పెరిగాయి. గతేడాది కాలంగా నాటిన మొక్కల పరిస్థితి గందరగోళంగా మారింది. వాటి నిర్వహణలో లోపంతో అవి ఎండిపోతున్నాయి. ఏపుగా పెరగలేక సగానికి ఆగిపోతున్నాయి. పశువులు, మేకలకు మేతగా మారి ఆనవాళ్లు లేకుండా పోతున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి కమిషనర్ నియామకం జరిగినప్పటికీ పురపాలక సంస్థలో ఆవహించిన నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. ఆకస్మిక పర్యటనలు, తనిఖీలు చేపడితే కింది స్థాయి సిబ్బందిలో పని పట్ల బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులే పట్టింపులేనితనంగా ఉండడంతో మిగిలిన వారంతా తమకేం సంబంధం అన్నట్లుగా టైం పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారుతీనగర్, గంగస్థాన్ ఫేజ్ 1, ఫేజ్ 2, గూపన్పల్లి, వినాయక్‌నగర్, ఆర్యనగర్, ప్రగతినగర్‌లో రోడ్ల వెంట మొక్కల ఆనవాళ్లు పూర్తిగా తొలగిపోయాయి. ఆయా చోట్ల వాకర్స్ చొరవ తీసుకుని ఉదయం పూట మొక్కలకు నీళ్లు పట్టడంతో ప్రాణం పోసుకుంటున్నాయి. వాకర్స్‌కు ఉన్న శ్రద్ధ కూడా నగరపాలక సంస్థకు లేకపోవడం విడ్డూరంగా మారింది.
నీరుగారుతున్న హరిత లక్ష్యం…
పచ్చదనం ప్రగతికి ఇంధనం. ఆహ్లాదానికి ఆలవాలం. ఈ విషయాన్ని గుర్తించే గత ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకువచ్చారు. తెలంగాణకు పచ్చని అందాలను అద్దారు. తొమ్మిది విడుతలుగా దిగ్విజయంగా కార్యక్రమాలను చేపట్టి సత్ఫలితాలను తీసుకు వచ్చారు. జీవ వైవిధ్యానికి బలమైన పునాది వేసిన హరితహారంలో అత్యధిక మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేశారు. రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచడానికి, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేందుకు హరితహారం ఎంతో దోహదం చేసింది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎటు చూసినా పచ్చదనానికి, ఆహ్లాదకర వాతావరణానికి జీవం పోస్తే ఇప్పుడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వ్యవహిస్తూ హరితహారాన్ని హరిస్తున్నది. పట్టింపులేనితనంతో అమూల్యమైన హరిత లక్ష్యం నీరుగారుతున్నది. హరితహారం మొక్కల పెంపకంలో ఎటు చూసినా నిర్లక్ష్యం తాండవిస్తుండడంతో గ్రామాలు కళావిహీనంగా మారుతున్నాయి.
నర్సరీల నిర్వహణ గాలికి…
హరితహారం ప్రారంభమైన సమయంలో మొక్కలు అందుబాటులో లేకపోయేవి. ప్రైవేటు నర్సరీల్లో కొనుగోలు చేసి నాటడం భారీ తంతుగా ఉండేది. దీంతో ఖర్చును నిలువరించేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ ఖర్చుతోనే నర్సరీలను గత సర్కారు ఏర్పాటు చేసింది. ఇది వరకు కొన్ని చోట్ల మాత్రమే నర్సరీలు ఉండేవి. నాలుగేండ్ల క్రితం ప్రతి గ్రామానికి నర్సరీని ఏర్పాటు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో వాటిని ఏర్పాటు చేయగా, పురపాలికల్లో సైతం నర్సరీలను నిర్వహిస్తున్నారు. వీటిల్లో సుమారు కోటి మొక్కలను పెంచుతున్నారు. వానాకాలం ప్రారంభ సమయానికి హరితహారం కార్యక్రమంలో వీటిని నాటేందుకు వినియోగించే ఏర్పాటు చేస్తుండేది. అయితే ఇప్పుడు చాలా చోట్ల నర్సరీల నిర్వహణ గాలికి వదిలేశారు. పట్టించుకునే వారు కరువవ్వడంతో నర్సరీల్లో మొక్కల ఎదుగుదల లోపించి చేతికి రాకుండా పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీటి కొరత ఓ వైపు, సిబ్బంది లేమితో నర్సరీలు అస్తవ్యస్తంగా మారాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

