నస్రుల్లాబాద్ : వినియోగదారులకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని కామారెడ్డి ( Kamareddy ) ట్రాన్స్కో ఎస్ఈ శ్రావణ్ కుమార్ (SE Shravan Kumar ) అన్నారు. గురువారం నస్రుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. సబ్ స్టేషన్ లో జరుగుతున్న ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రెండు సబ్ స్టేషన్లలో ( Sub Stations) విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట కామారెడ్డి డీఈ నాగరాజు, బాన్సువాడ డీఈ గంగాధర్, ఏఈ బాన్సువాడ అరవింద్ , సిబ్బంది ఉన్నారు.