కంఠేశ్వర్, ఆగస్టు 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపి ణీ కార్యక్రమం నిజామాబాద్‌లో శనివా రం ప్రారంభమైంది. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి.. రూరల్, అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పలువురు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. ఇన్చార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో 4.77 లక్షల కుటుంబాలకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర మేయర్ ఉమారాణి, సీపీ సాయిచైతన్య, డీఎఫ్‌వో ప్రశాంత్, అధికారులు శుభం నగ్రాలే, గీత, దిలీప్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, నాయకులు తారిక్ అన్సారీ, గంగాధర్, సురేశ్, రేషన్ లబ్ధిదారులు, డీలర్లు పాల్గొన్నారు.