కోటగిరి : ధర్మబిక్షం (Dharmabiksham) జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ గీత పని వార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి విట్టల్ గౌడ్ ( Vittal Goud) అన్నారు . కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ గీత పని వార్ల సంఘం ఆధ్వర్యంలో ధర్మ బిక్షం 103 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు కామ్రేడ్ ధర్మ బిక్షం అని కొనియాడారు . ఆయన పోరాటాల ఫలితమే ఐదు ఎకరాల భూమి వన పెంపకం, పెన్షన్ లభించిందని అన్నారు . ధర్మబిక్షం గౌడ కులస్తుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, గౌడ కులస్తుల పిల్లల కోసం హైదరాబాదులో గౌడ హాస్టల్ నిర్మించారని అన్నారు.
ధర్మ బిక్షం విగ్రహాన్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్, ప్రకాష్ గౌడ్, కృష్ణ గౌడ్, శ్రీధర్ గౌడ్, నరేష్ గౌడ్, సురేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.