Nizamsagar | జుక్కల్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏలే మల్లికార్జున్ నియామకమయ్యారు. ఆయన డీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి నియోజకవర్గానికి శుక్రవారం చేరుకున్నారు. కాగా నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా నుంచి పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు.
అనంతరం పిట్లం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.