గుజరాత్ : గుజరాత్ ముంద్రా పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. గుజరాత్ ఏటీఎస్ , ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో రూ.1,150 కోట్ల విలువైన 118.98 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు.
మంగళవారం ముంద్రా పోర్టు బయట లంగర్ వద్ద సైప్రస్ జెండా గల ‘యూరప్’ అనే నౌక నుంచి ముగ్గురు భారీ బ్యాగులను సముద్రంలోకి విసరడాన్ని అధికారులు గుర్తించి వెంటనే తనిఖీలు చేసి.. నీటిపై తేలుతున్న ఐదు సంచులను స్వాధీనం చేసుకున్నారు.