వామ్మో ఏపీకే ఫైల్స్ !
సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. ‘పీఎం కిసాన్' పథకానికి దరఖాస్తు చేసుకోండి’, ఎస్బీఐ రివార్డు పాయింట్లు పొందండి’ అని ఆశచూపుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) ఫైళ్లను పంపి నిత్యం ఎంతో మందిని దారుణంగా మోసగిస్తున్నారు.
- పీఎంకేవై, ఎస్బీఐ రివార్డుల పేరిట సైబర్ దాడి
- సామాజిక మాధ్యమాల్లో జోరుగా షేరింగ్
- ఒక్క క్లిక్‌తో డబ్బులు, వ్యక్తిగత సమాచారం చోరీ
- అత్యాశకు పోయి ఆగమాగమవుతున్న జనం
- తాజాగా మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. ‘పీఎం కిసాన్’ పథకానికి దరఖాస్తు చేసుకోండి’, ఎస్బీఐ రివార్డు పాయింట్లు పొందండి’ అని ఆశచూపుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్) ఫైళ్లను పంపి నిత్యం ఎంతో మందిని దారుణంగా మోసగిస్తున్నారు. వారి మాటలను నమ్మి గుడ్డిగా ఆ ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేయగానే ఆ అమాయకుల ఫోన్లను హ్యాక్ చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులు 5 వేలకుపైగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 50 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేరాల వల్ల ఈ ఏడాది తెలంగాణలో బాధితులు మొత్తంగా రూ.50 కోట్ల వరకూ మోసపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోయినట్టు సమాచారం. తెలంగాణతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్‌లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
చలనంలేని ప్రభుత్వం
‘పీఎం కిసాన్ యోజన’ (పీఎంకేవై) పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైళ్లను పంపి తెలం గాణలో వేల మంది అమాయక రైతులను మోసగిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీంతో మరింత రెచ్చిపోతున్న కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రులపైనే పంజా విసిరారు. ‘ఎస్బీఐ రివార్డు పాయింట్ల’ పేరిట ఏపీకే ఫైళ్లను పంపి వారి వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారు. దీంతో ఎట్టకేలకు నిద్రలేచిన సైబర్ క్రైమ్ పోలీసులు.. మంత్రులకు వచ్చిన ఏపీకే ఫైళ్లపై మాత్రమే దృష్టి పెట్టారు. పీఎంకేవై పేరుతో చాలా కాలంగా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను గుర్తించడం లేదు. కనీసం ఆ మోసాల బారిన పడకుండా ఉండేలా రైతులకు అవగాహన కూడా కల్పించడం లేదు.
ఏపీకే ఫైల్స్ దశలవారీ పని తీరు..
1. డౌన్లోడ్: ఇంటర్నెట్ ద్వారా హానికరమైన ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
2. ఇన్స్టాలేషన్: ఆ ఫైల్‌పై క్లిక్ చేసిన వెంటనే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. వాస్తవా నికి ఆ యాప్ గూగుల్, యాపిల్ ప్లేసో ్టర్లలో ఉండదు.
3. యాక్టివేషన్: యాప్ ఇన్స్టాల్ అవగానే అది యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే ఆ యాప్‌లో దాగి ఉన్న వైరస్, హానికర కోడ్ పనిచేయడం మొదలవుతుంది.
4. డాటా చోరీ: స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాంకింగ్ సమాచారం (లాగిన్ వివరాలు, ఖాతా నంబర్లు), వ్యక్తిగత వివరాలు, (పేరు, చిరునామా, ఫోన్‌నంబర్, ఆధార్), కీ లాగింగ్ (టైప్ చేసిన మాటలు/ పాస్ వర్డ్లు), ఓటీపీలు ఉన్న ఎస్ఎంఎస్లు సహా ఇతర సున్నిత సమాచారాన్నంతా సైబర్ నేరగాళ్లు కాజేస్తారు.
5. తస్కరించిన డాటా ఆధారంగా కేటుగాళ్లు మన పేరుతో బ్యాంకు ఖాతాలు తెరు స్తారు. వాటి ద్వారా అక్రమ లావా దేవీలు నిర్వహిస్తారు. మనకు తెలియ కుండానే మన పేరిట రుణాలు పొంద డంతోపాటు బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే సామా జిక మాధ్యమాల నుంచి హానికర ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయకూడదు. అవసరమైన యాప్‌లను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా సురక్షి తంగా ఉండాలంటే Avast, Norton, Bitdefender లాంటి యాంటీ వైరస్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవరైనా సైబర్ నేరాల బారినపడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్ర దించి, ఫిర్యాదు చేయాలి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

