బొక్క బోర్ల వడుడే..
స్వరాష్ట్రంలో సంతోషంగా బతుకుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం జేస్తున్నది. ధరణి ఎత్తేస్తామని, కరెంట్ కట్ చేస్తామని అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటల కరెంట్ చాలని, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలన్నా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది.
- కాంగ్రెస్‌కు ఓటేస్తే బాధలు కొని తెచ్చుకున్నట్లే
- రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న రైతాంగం
- 10హెచ్‌పీ మోటర్ల భారం ఎవరు మోస్తారని ప్రశ్న
- ధరణి ఎత్తేస్తామంటున్న కాంగ్రెస్‌పై కర్షకుల కన్నెర్ర
- దళారుల రాజ్యం తెచ్చేందుకే కుట్రలు
- పోర్టల్ తీసేస్తే ఆత్మహత్యలే గతి అని ఆవేదన
- హస్తానికి ఓటు.. అభివృద్ధికి చేటు అంటున్న రైతులు
స్వరాష్ట్రంలో సంతోషంగా బతుకుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం జేస్తున్నది. ధరణి ఎత్తేస్తామని, కరెంట్ కట్ చేస్తామని అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటల కరెంట్ చాలని, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలన్నా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ‘ఎద్దు, ఎవుసం తెల్వనోళ్లు ఏది వడితే అది మాట్లాడుతుండ్రు. ఒక్కడన్న నాగలి వట్టిండా..? నారు ఏసిండా..? తెలంగాణ అచ్చినంకనే ఎవుసం లైన్ల వడ్డది. ఇప్పుడిప్పుడే మా బతుకులు బాగువడ్తున్నాయ్. మేం సల్లగా బతుకుతుంటే కాంగ్రెస్ లీడర్లు కండ్లల్ల నిప్పులు పోసుకుంటున్నారని’ రైతులు మండిపడుతున్నారు. ‘అరే పది ఎస్పర్ల మోటర్లు పెట్టమంటున్న రేవంత్‌రెడ్డికి అసలు నెత్తి ఉన్నదా? కొత్త మోటర్లు పెట్టాలంటే ఎంత ఖర్చైతది. ఆ భారం ఎవరు మోస్తారు? కేసీఆర్ పాలనల రైతులకు ఏ రందీ లేదు. పంటలు ఏసేతందుకు ప్రభుత్వమే పైసలు ఇయ్యవట్టే. పండిన పంటలు ప్రభుత్వమే కొనవట్టే. గిదంత జూసి కాంగ్రెసోళ్లకు సోచయిస్తలేదు. అందుకే రైతులకు మంచి సౌలత్గా ఉన్న ధరణిని ఎత్తేస్తామంటున్నారు. కరెంట్ కోతలు పెడ్తామంటున్నారు. రైతులను ముంచుతామని అధికారంలకు రాకముందే ఖుల్లాం ఖుల్ల్లా చెబుతున్నారు. మరీ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలె’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని కడుపుల పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్ సారు వెంటే నడుస్తామని, కారు గుర్తుకే మా ఓటు అని స్పష్టంగా చెబుతున్నారు.
– నిజామాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రైతే రాజు అన్న విషయాన్ని గుర్తించిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 2014లో అధికారంలోకి రాగానే మొట్టమొదటగా రైతు, వ్యవసాయాభివృద్ధిపైనే దృష్టి సారించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. తూములు మరమ్మతు చేయించారు. జలసిరులను ఒడిసి పట్టి సాగుపై ఆధారపడి జీవిస్తున్న వర్గాలను కంటికి రెప్పలా కాపాడారు. రైతుబంధు, రైతుబీమా, పంటల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఉచిత విద్యుత్ వంటివి తీసుకువచ్చి బక్కపల్చని రైతు బలపడేలా మార్చారు. నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తూ రైతులకు రక్షణగా నిలిచారు. రైతుకు ఇష్టమైన సమయంలో పొలానికి నీళ్లు పారించుకునే వెసులుబాటు కల్పించారు. విజయవంతంగా సాగుతున్న ఉచిత కరెంట్‌పై అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పడుతున్నది. కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలపై విషం చిమ్ముతూనే రైతుల జీవితాలతో చెలగాటం ఆడేలా ప్రయత్నిస్తోంది. 3గంటల కరెంట్ సరిపోతుందని, 10 హెచ్‌పీ మోటర్లతోనే పొలాలకు భూగర్భ జలాలను పారించుకోవచ్చంటూ ఉచిత సలహాలు అందిస్తూ రైతును ఆగమాగం చేస్తున్నది. మరోవైపు రైతుల భూములకు కొండంత ధైర్యంగా ఉన్న ధరణి పోర్టల్‌ను సైతం తీసేస్తామంటూ కర్షకుడి సాగు భూములకు కిరికిరి పంచాయితీలు పెడతామన్నట్లుగానే కాంగ్రెస్ నడుం బిగించింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు చెబుతున్న కల్లబొల్లి మాటలు, అసంబద్ధమైన హామీలపై రైతులతో “నమస్తే తెలంగాణ” మాట్లాడగా వారంతా దుమ్మెత్తి పోస్తున్నారు. 10హెచ్‌పీ మోటర్లతో బొక్కా బోర్ల పడుడే తప్పా ప్రయోజనం ఏమిటని రైతులు అంటున్నారు. ధరణి తీసేస్తే సామాన్యుల భూములకు రక్షణ ఏముంటుందని ఆందోళన చెందుతున్నారు.
నెత్తి ఉన్నోడు మాట్లాడతాడా?
మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడూ వ్యవసాయానికి 3గంటల కరెంట్ సరిపోతుందని మాట్లాడరంటూ రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అసలు వ్యవసాయం గురించే తెల్వదంటున్నారు. 3గంటల కరెంట్ ఇస్తే రోజుకొక్క దొయ్య కూడా తడవదని వివరించి చెబుతున్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైతులను ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారుతాయని అంటున్నారు. రైతు కష్టం తెలిసిన కేసీఆరే సీఎంగా ఉండడంతో దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతుకు మేలు చేకూరే పథకాలు అనేకం అమలవుతున్నాయని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలంతా గిమ్మిక్కులు చేస్తున్నారని వాటిని రైతులు నమ్మి మోస పోవద్దంటూ సూచనలు చేస్తున్నారు. రైతులను ఆదుకునే తెలివే ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు 24గంటల కరెంట్ ఇస్తలేదో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక 10హెచ్‌పీ ఫార్ములా పేరుతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను రైతులు తప్పుబడుతున్నారు. సంతోషంగా ఉన్న రైతును రోడ్డు పాలు చేసేందుకు కాంగ్రెస్ ఆడుతోన్న నాటకాలంటూ కర్షకలోకం మండిపడుతున్నది. ఎన్నికల హామీల్లో ఎక్కడా 24గంటల కరెంట్‌పై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, పదేపదే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో సాగుకు 3గంటల కరెంట్ సరిపోతుందంటూ చెప్పుకోవడం కుట్రలో భాగంగానే జరుగుతున్న తంతుగానే అన్నదాతలు ఆలోచనలో పడ్డారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

