Rajiv Gandhi Hanumathu | బియ్యం నిల్వలను వేగంగా తరలించాలని.. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతు ఆదేశం
మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు, ధాన్యం బస్తాలను భద్రపరుస్తున్న తీరును గమనించారు.
Rajiv Gandhi Hanumathu | కంఠేశ్వర్, మే 22 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు, ధాన్యం బస్తాలను భద్రపరుస్తున్న తీరును గమనించారు. ఎన్ని రైస్ మిల్లుల నుండి ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిగిన బియ్యం నిల్వలు, వాటి నాణ్యత పరిశీలన, లాటింగ్ ప్రక్రియలను ఎలా నిర్వహిస్తున్నారనే తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, బియ్యం, ధాన్యం నిల్వలను గిడ్డంగులకు వేగవంతంగా తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున మిల్లుల వద్ద, కొనుగోలు కేంద్రాలలో బియ్యం, ధాన్యం బస్తాలు తడిసిపోకుండా యుద్ధప్రాతిపదికన వాటిని గోడౌన్లకు తరలించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోడౌన్లలో లీకేజీలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
లోడింగ్, ఆన్లోడింగ్ ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా సరిపడా సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ఆయా గిడ్డంగులలో అందుబాటులో ఉన్న స్థలం పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలని, బియ్యం, ధాన్యం బస్తాల తరలింపు సమయంలో వర్షాల వల్ల తడిసిపోకుండా టార్పాలిన్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.
కాగా, గిడ్డంగుల వద్ద బియ్యం నిల్వలను ఆన్లోడింగ్ చేయించడంలో కాంట్రాక్టర్ అలసత్వ వైఖరిని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టరుపై నిబంధనలకు అనుగుణంగా చర్యలకు సిఫార్సు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ సెక్రెటరీ అపర్ణ, గోడౌన్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

