ఒంటరి మహిళలే టార్గెట్.. గ్రామీణ ప్రాంతాలపై చైన్ స్నాచర్ల గురి
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా వరకు గ్రామీ ణ ప్రాంతాలున్నాయి.
- పొలాలు వద్ద మహిళల మెడలోంచి గొలుసులు చోరీ
- భయాందోళనలో శివారు ప్రాంతాల ప్రజలు
- పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని వేడుకోలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా వరకు గ్రామీ ణ ప్రాంతాలున్నాయి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం ఉండడంతో మహిళలు నడుచుకుంటూ వెళ్తుంటారు. పొలా ల వద్ద ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు. దుండగులు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసి ఒంటరి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళుతున్నారు.
గురువారం ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ షాద్నగర్ పరిధిలో పొలంలో కూర్చొని ఉన్న వీరమ్మ అనే మహిళ మెడలో నుంచి మధ్యాహ్నం సమయంలో బైక్పై వచ్చిన దుండుగులు నాలుగు తులాల బంగారు పుస్తెల తాడునే లాక్కొని పరారయ్యారు. ఏడాది క్రితం కేశంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో పొలం నుంచి ఇంటికి వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి స్నాచ ర్లు బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరంతో పాటు సిటీ బయట వివిధ రాష్ర్టాలకు చెందిన వారు జీవనోపాధి కోసం వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఇండస్ట్రిస్తో పాటు వ్యవసాయ పనుల్లోను ఆయా రాష్ర్టాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటూ అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠాలు మహిళలను టార్గెట్ చేస్తున్నాయి. ఒక్కో పోలీస్స్టేషన్ పరిధిలో ఒకటి రెండు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ వాహనాలు మాత్రమే ఉంటాయి. ఉదయం, సాయం త్రం పెట్రోలింగ్ వాహనాలు రౌండ్ కొట్టాయంటూ అదే ఎక్కువ అయిపోయిందనే భావనలో ఉంటారు. అయితే విజిబుల్ పోలీసింగ్తోనే స్నాచర్ల ఆటకట్ట వచ్చని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే గ్రామానికో పోలీసు అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనుమానితులు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ అందరిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్థానికులు చెబుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

