నయా రూట్లో సైబర్ దోపిడీ
మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. కస్టమర్‌కేర్‌కు మీరు కనెక్ట్ అయ్యి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి.. అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే.. ఒక టోల్‌ఫ్రీ నంబర్‌కు కనెక్ట్ అవుతుంది..
- రెండు గంటల్లో మీ ఫోన్ బ్లాక్ అవుతుంది..
- తెలుసుకోవాలంటే 9 నొక్కండి
- మనీలాండరింగ్ కేసు నమోదయ్యింది
- సెటిల్ చేసుకో.. లేదంటే అరెస్టు అంటూ కాల్స్
సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. కస్టమర్‌కేర్‌కు మీరు కనెక్ట్ అయ్యి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి.. అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే.. ఒక టోల్‌ఫ్రీ నంబర్‌కు కనెక్ట్ అవుతుంది.. మీ ఫోన్ నంబర్‌తో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. ఉత్తరప్రదేశ్ లక్నోలో మీపై కేసు నమోదయ్యిందంటూ చెబుతారు.. ఈ సమాచారం నిజమని నమ్మిన కొందరు భయపడుతున్నారు. మరికొందరు అనుమానం వచ్చి ఫేక్ అనుకుంటున్నారు. ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ సరఫరా అవుతుంటే మీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ దొరికింది..
మీపై మనీ లాండరింగ్ కేసు నమోదయ్యిందంటూ లక్షలు, కోట్ల రూపాయలు దోచేస్తున్న సైబర్‌నేరగాళ్లు.. అదే మోసాన్ని కొత్త తరహాలో మొదలు పెట్టారు. సైబర్‌నేరగాళ్లు ప్రతి రోజూ వందల సంఖ్యలో కాల్స్ చేస్తూ మోసం చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఫోన్ లిఫ్టు చేయకపోతే వాట్సాప్‌కు యూపీ, ఢిల్లీకి చెందిన పోలీసు అధికారి ఫొటోను డీపీ పెట్టి.. ఫోన్ నంబర్‌ను పంపిస్తున్నారు. అలాగే, ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.. ఈ వివరాలు చూసుకోండి.. అంటూ .ఏపీకే ఫైల్స్‌ను పంపిస్తున్నారు.
నమ్మితే… నట్టేట ముంచేస్తారు..!
పోలీసులు ఫోన్ చేశారు.. మనం మాట్లాడకపోతే ఇబ్బంది పెడుతారనే భయంతో కొందరు నిజమని నమ్మేస్తున్నారు. మీ ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్‌లను సర్వీస్ ప్రొవైడర్లు పంపరని, అలా ఒకవేళ అనుమానం ఉంటే, మీ సిమ్ కార్డుకు సంబంధించిన నెట్వర్క్ ప్రొవైడర్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్‌కు వచ్చే మెస్సేజ్‌లు, వాట్సాప్ కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు చెబుతున్నారు.
బ్యాంకు ఖాతాల వివరాలతో..
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంతో మీ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశామని, మీపై మనీ లాండరింగ్ కేసు నమోదయ్యిందని భయపెడుతూ బాధితుడికి సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేశారు. లక్నోలోని అలామ్బాగ్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డుతో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐలో బ్యాంకు ఖాతాలు తెరిచారు. అందులో మనీలాండరింగ్ జరిగింది..
మీపై ఫెమా, ఎఫ్ఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయని, వెంటనే రూ. 3.05 లక్షలు డిపాజిట్ చేయాలని, లేదంటే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు. దీనిపై అనుమానం వచ్చి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఇలాగే, రెండు రోజుల కిందట ఓ వ్యక్తికి వచ్చిన బెదిరింపు కాల్‌తో రూ.4 లక్షలు మోసపోయాడు. ఇటీవల ఈ కేసులు పెరుగుతున్నాయని, గుర్తుతెలియని వ్యక్తులు చేసే ఫోన్లకు భయపడొద్దని, అనుమానం ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

