బాన్సువాడ రూరల్, జూలై 20: పోషణ భారంగా భావించి కన్న కూతురునే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్రపన్నారు. ఏడు నెలల చిన్నారిని బ్లేడుతో గాట్లు పెట్టి కుక్కలు ఎత్తుకెళ్లాయంటూ కట్టు కథలు అల్లారు. ఎట్టకేలకు వారిద్దరూ కటకటాల పాలయ్యారు. బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. సోమవారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి హత్యాయత్నం కేసు వివరాలను వెల్లడించారు. సం కు శైలజ, టేకు సతీశ్ భార్యభర్తలు. రెండేండ్ల క్రితం సతీశ్‌ను శైలజ చెల్లెలు సంధ్య రెండో వివాహం చేసుకోగా, వారికి వైష్ణవి అనే కూతురు జన్మించింది.
సంధ్య, సతీశ్ మధ్య దాంపత్యంలో వివాదాలు చోటుచేసుకోవడంతో పెద్దల సమక్షంలో చిన్నారిని తండ్రి సతీశ్ దగ్గరే ఉంచారు. ఈ నెల 15న ఉదయం ఇంట్లో చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతకగా, ఇంటి సమీపంలోని ముండ్ల పొదల్లో తీవ్ర గాయాలతో వైష్ణవి అపస్మారక స్థితిలో లభించింది. వెంటనే బాన్సువాడ, నిజామాబాద్ దవాఖానలకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్‌కు తరలించారు. ఈ ఘటనపై సంధ్య తన అక్క శైలజపై అనుమా నం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. సతీశ్‌కు, మొదటి భార్య శైలజకు ముగ్గురు పిల్లలు ఉండగా, తర్వాత చెల్లెలు సంధ్యను వివా హం చేసుకున్నాడు. విడాకుల తర్వాత వైష్ణవిని పోషించడం భారంగా మారడం, కుటుం బ గొడవల కారణంగా చిన్నారిని అడ్డు తొలగించుకోవాలని సతీశ్, శైలజ హత్యకు పథకం వేశారు.
ఈ నెల 14న అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న వైష్టవిని ఇద్దరూ కలిసి తీసుకెళ్లి వెంట తెచ్చుకున్న బ్లేడ్లతో శరీరంపై పలుచోట్ల గాయాలు చేశారు. మృతిచెందినట్లు భావించి అక్కడే వదిలేసి వెళ్లిపోయా రు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని గ్రామస్తులకు చెప్పి, వారి తో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్నచోటికి వెళ్లి అక్కడ ఉన్నట్లు గుర్తించారు. రాత్రి కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచాయని నమ్మించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాం గ్మూలాలతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించినట్లు చెప్పారు. టేకు సతీశ్, సంకు శైలజను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.