Siriconda | సిరికొండ, మే 10 : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) ఏకగ్రీవంగా నిర్ణయం చేసింది. రావుట్ల గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తూ గ్రామస్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థుల నుండి వచ్చిన ఫిర్యాదులు మరియు వారి అంగీకారం మేరకు ఈ ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వకూడదని కమిటీ సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.