ఆర్మూర్: పాఠశాలల ప్రారంభోత్సవానికి ముందే పకడ్బందీగా కొవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయం లో బుధవారం ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ హాజరై మాట్లాడారు.
మండలంలోని అన్ని పాఠశాలల్లో గదులు, పరిసరాలను మున్సిపల్, గ్రామపంచాయతీల సహకారంతో శుభ్రం చేయించుకోవాలన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సహకారంతో పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపిబాబు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, ఎంఈవో పింజ రాజగంగారాం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరహరి, సీతయ్య, సవిత, హరిత, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.