సాగు బరువై.. బతుకు ఆగమై
యాసంగి సాగుపై అన్నదాత ఆగమవుతున్నడు. సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. ఒకవైపు రోజురోజుకూ ఎండలు ముదురుతుండడం.. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టులు, కాలువల ద్వారా సాగునీరందించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
- ముదురుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు
- ఎండుతున్న యాసంగి పంటలు
- ప్యాకేజీ-21 ద్వారా అందని సాగునీరు
- పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు
భీమ్‌గల్, మార్చి 2: యాసంగి సాగుపై అన్నదాత ఆగమవుతున్నడు. సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. ఒకవైపు రోజురోజుకూ ఎండలు ముదురుతుండడం.. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టులు, కాలువల ద్వారా సాగునీరందించడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్యాకేజీ-21 పనులను అప్పటి మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శరవేగంగా పూర్తిచేయించారు. దీంతో రైతులు సంతోషించారు. ప్యాకేజీ-21 ద్వారా గతేడాది యాసంగిలో బాల్కొండ నియోజకవర్గంలో 78 వేల ఎకరాలు, భీమ్‌గల్ మండలంలో 28,230 ఎకరాల్లో పంటలు పండించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్యాకేజీ -21 ద్వారా పంటలకు సాగునీరందించలేదు. పంటలు ఎండిపోతున్నాయని, నీరందించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. రైతుల వినతిమేరకు ప్యాకేజీ -21 ద్వారా నీటిని అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు లేఖ రాసినప్పటికీ వారిలో చలనం కరువైంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఎండుతున్న పంట..పశువులకు మేతగా..
గత కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సకాలంలో నీటి విడుదల చేపట్టింది. దీంతో రైతులు పంటలను పుష్కలంగా పండించుకొన్నారు.ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. యాసంగి పంటలకు ఇప్పటివరకు సాగునీరందడంలేదు. ఎండాకాలం మొదట్లోనే ఈ పరిస్థితి ఉంటే వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పలు గ్రామాల్లో నీరందక వేసిన పంటలు ఎండిపోతుండడంతో బీడు భూములుగా మారుతున్నాయి. కొందరు రైతులు తాము వేసిన పంట ఎండిపోవడాన్ని చూడలేక వాటిని పశువుల మేతగా ఉపయోగిస్తుండడం గమనార్హం. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికైనా సాగునీరందించాలని కోరుతున్నారు.
పెట్టుబడి మొత్తం లాసయినం..
ప్యాకేజీ-21 ద్వారా నీళ్లియ్యకపోవడంతో మా పంట పొలాలు ఎండిపోతున్నయ్.గతేడాది కేసీఆర్ సర్కారు నీళ్లిచ్చి మా పొలాలను కాపాడింది.ఇప్పుడు సాగునీరందక పంట మొత్తం ఎండిపోతున్నది. ఈ పరిస్థితిని సూడబుద్ధికాక పశువుల మేత కోసం పంటను కోస్తున్న. ఈయేడు పంట రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి మొత్తం లాసయినం. బోర్లల్ల నీళ్లు అడుగంటిసుక్క నీరు అస్తలేదు. పక్కనే కప్పలవాగు ఉన్నా నీళ్లులేక మస్తు తిప్పలు పడుతున్నం. దీనికి తోడు కరెంటు కష్టాలు మొదలైనయి.
-కోగురు నర్సయ్య, రైతు, జెబ్జోర, భీమ్‌గల్ మండలం
మళ్లీ ట్రాన్స్ఫార్మర్లు సతాయిస్తున్నయ్..
మా పొలం పక్కనే కప్పలవాగు ఉన్నది. వాగులో సుక్క నీళ్లులేవు. గతేడాది అప్పటి ప్రభుత్వం ప్యాకేజీ -21 ద్వారా వాగులోకి నీళ్లు వదిలి మా పంటలను బతికిచ్చింది. కొత్త ప్రభుత్వం ఈ ఏడాది కూడా నీళ్లు ఇస్తదని ఎదురుచూశాం. కానీ మా ఆశలపై నీళ్లు జల్లింది. సాగునీరు అందక మా పొలాలన్నీ ఎండిపోతున్నయ్. దీనికితోడు కరెంటు కష్టాలు మొదలయ్యాయి.ట్రాన్స్ఫార్మర్లు సతాయిస్తున్నాయి. మళ్లీ గడ్డురోజులొచ్చాయ్. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆలోచిస్తేనే భయమేస్తున్నది.
-బర్ల శ్రీకాంత్, రైతు, బెజ్జోర, భీమ్‌గల్ మండలం
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

