ప్రైవేట్ దవాఖానలో గర్భిణి మృతి
గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బంధువులు సదరు దవాఖాన ఎదుట నిరసన తెలిపారు.
- మృతదేహంతో దవాఖాన ఎదుట ఆందోళన
వినాయక్‌నగర్/ ఖలీల్‌వాడి, ఏప్రిల్ 28 : గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బంధువులు సదరు దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్భిణి కంఠం స్రవంతి (35) వీక్లీ మార్కెట్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యురాలికి చూపించుకున్నది. శనివారం ఉదయం సదరు దవాఖానలో హెల్త్ చెకప్ కోసం వచ్చింది. గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, హార్ట్ బీట్, శ్వాస సంబంధిత సమస్య ఉందని వైద్యులు గర్భిణికి సూచించారు. అబార్షన్‌కు సంబంధించిన మందులు ఇవ్వడంతో గర్భిణి, కుటుంబీకులు అవి తీసుకొని ఇంటికెళ్లారు.
మందులు వేసుకున్న అనంతరం గర్భిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె కుటుంబీకులు ఆందోళనకు గురై దవాఖానకు ఫోన్ చేసి మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉదయాన్నే గర్భిణిని దవాఖానకు తీసుకురావాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం గర్భిణిని సదరు దవాఖానకు తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉన్నది, మరో దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక గర్భిణి బంధువులు మరో దవాఖానకు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన గర్భిణి కుటుంబీకులు, బంధువులు సదరు ప్రైవేట్ దవాఖాన ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే స్రవంతి మృతిచెందిందని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మధ్యవర్తుల ద్వారా బాధిత కుటుంబానికి దవాఖాన యాజమాన్యం నష్టపరిహారం చెల్లించడంతో వారు ఆందోళన విరమించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

