నిజామాబాద్ క్రైం/ ఖలీల్‌వాడి, జూన్ 12 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లాకేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో 2కే రన్‌ను సోమవారం నిర్వహించారు. 2కే రన్లో విద్యార్థులు, ఎన్సీసీ కెడెట్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా క్రీడలు,యువజన సర్వీసుల శాఖ తోడ్పాటుతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో రన్‌ను నిర్వహించారు. నగరంలోని పూలాంగ్ చౌరస్తా నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ర్యాలీ.. పోలీస్ పరేడ్ మైదానం వరకు కొనసాగింది. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన తెల్ల టీ షర్టులను ధరించి చిన్నాపెద్ద అనే తేడాలేకుండా రన్లో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు హాజరై బెలూన్లను గాలిలోకి ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు. జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్ దండు నీతూకిరణ్, అదనపు డీసీపీలు మధుసూదన్‌రావు, గిరిరాజా, ఏసీపీ కిరణ్‌కుమార్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఏసీపీ కిరణ్‌కుమార్‌తోపాటు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కెడెట్లు, నర్సింగ్ కళాశాల, ఇతర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, వైద్యులు, క్రీడాసంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దశాబ్ది ఉత్సవ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. యువత రన్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతిలో మరింత మమేకమవుదామని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న పాల్గొన్నారు.
డిచ్పల్లి, జూన్ 12 : మండలకేంద్రంలోని నాగపూర్ గేటు నుంచి కేఎన్ఆర్ గార్డెన్ వరకు 2కే రన్‌ను నిర్వహించగా.. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. దివ్యాంగులకు రూ. వెయ్యి పెన్షన్ పెంచడం సంతోషంగా ఉందని, రూరల్ నియోజకవర్గంలో 5 వేల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఆర్డీవో రవి, 7వ బెటాలియన్ కమాండెంట్ సత్యశ్రీనివాస్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిర, ఇందల్వాయి ఎంపీపీ రమేశ్ నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, చిలువేరి గంగాదాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, మోహన్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సత్యనారాయణ, తహసీల్దార్లు శ్రీనివాస్‌రావు, రోజా, ఎంపీడీవో గోపీబాబు, రాములు నాయక్, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్, రాజ్‌కాంత్‌రావు, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, పద్మారావు, పాశం కుమార్, చింతల దాసు, సీఐ కృష్ణ, ఎస్సైలు గణేశ్, నరేశ్, శ్రీకాంత్, విండో చైర్మన్లు గోవర్ధన్‌రెడ్డి, రామకృష్ణ, జైపాల్, తారాచంద్ పాల్గొన్నారు.
ఆర్మూర్, జూన్12; ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కే రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హాజరై జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించి అందరితో కలిసి పరుగులు తీశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండ్లు కండ్లు అని అన్నారు. దశాబ్ది ఉత్సవాలపై ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తెలంగాణను శత్రువుగా చూస్తోందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్ చైర్మన్ మున్నా, ఆర్మూర్ , నందిపేట్ జడ్పీటీసీలు మెట్ట సంతోష్, యమునా ముత్యం, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట ఎంపీపీలు పస్క నర్సయ్య, మాస్త ప్రభాకర్, వాకిడి సంతోష్‌రెడ్డి, ఆర్మూర్ మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజనరేందర్, సీనియర్ నాయకుడు పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, ఖాందేష్శ్రీనివాస్, సుంకరి రవి, జనార్దన్‌గౌడ్, పోలసుధాకర్, ఎస్ఆర్ రమేశ్, ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సురేశ్‌బాబు, ఎస్సైలు రాములు, శివరాం, శ్రీకాంత్, యాదాగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌గల్, జూన్ 12: పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి 2కే రన్ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ ప్రభాకర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి ప్రారంభించారు. కార్యక్రమంలో యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ రన్ పూర్తి చేశారు. అనంతరం బస్టాండ్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, సొసైటీ చైర్మన్లు శివసారి నర్సయ్య, మలావత్ వెంకటేశ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొయీజ్, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మధుశేఖర్, రైతు నాయకులు కోటపాటి నర్సింహానాయుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, తహసీల్దార్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శక్కర్‌నగర్, జూన్ 12: బోధన్ పట్టణంలో ఏసీపీ కేఎం కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి తదితరులు 2కే రన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, ఎమ్మెల్యే సతీమణి అయేషా ఫాతిమాలు పలువురు అధికారులతో కలిసి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్, జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం. రజితాయాదవ్, బోధన్ పట్టణ, రూరల్ సీఐలు బీడీ ప్రేమ్‌కుమార్, జి.శ్రీనివాస రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, డేగావత్ ధూప్‌సింగ్ నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, నవీపేట్ ఎంపీపీ సంగెం శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్‌తో పాటు పట్టణానికి చెందిన వివిధ కళాశాలల ఎన్సీసీ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.