బుధవారం 20 జనవరి 2021
Nizamabad - Jan 08, 2021 , 01:04:21

సవాల్‌కు సిద్ధమా ?

సవాల్‌కు సిద్ధమా ?

  • బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గ్రామ గ్రామాన పంట కొనుగోళ్లు జరుగుతున్నట్లు నిరూపిస్తే   రాజీనామా చేస్తా..!
  • నిరూపించకుంటే ఎంపీ పదవులకు మీరు రాజీనామా చేస్తారా?
  • బండి సంజయ్‌, అర్వింద్‌లకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సవాల్‌

నిజామాబాద్‌, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మోర్తాడ్‌ : బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌ అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, రోడ్లు భవనాలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొనుగోలు కేం ద్రాలు అంటూ ఊదరగొడుతున్న వారు మన రా ష్ట్రంలో ఉన్నట్లు గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రా లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేని పక్షంలో ఎంపీ పదవులకు రాజీనామా చేస్తారా అని వారికి సవాల్‌ విసిరారు. మోర్తాడ్‌లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను  పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  అభివృద్ధి,  ప్రజల కోసం నిర్మాణాత్మక విమర్శలు చేయాలని కానీ కేవలం ఓట్ల కోసం పదవుల కోసం డ్రామాలు ఆడితే అవి తాత్కాలికమేనన్నది గుర్తించాలని హితవు పలికారు. 

అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఏ రాష్ట్రంలో ఏ పథకాలు అమలవుతున్నాయో గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే బయటపడుతాయని తెలిపారు. తెలంగాణలో జరుగుతు న్న అభివృద్ధి ఏమిటి... బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జ రుగుతున్నది  ఏమిటో  తెలిసే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.తెలంగాణలో పింఛన్‌ రూ. 2016, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం, అమ్మఒడి, రైతుబంధు పథకాలు అమలవుతున్నాయని ఇటువంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ముందు ఆ రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమపథకాలు అమలయ్యే లా చూడాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి 24 గంటల  విద్యుత్‌ సరఫరా, సాగునీటి వనరులు అందుబాటులోకి తేవడంతో కోటీ 10లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, ఇదే విధంగా గుజరాత్‌లో పంటలు పండిస్తున్నా రా, విద్యుత్‌, నీటివనరులను అందిస్తున్నారా అని ప్రశ్నించారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ను  మూడున్నరేండ్లలో పూర్తిచేసి చూపించిన మొనగాడు కేసీఆర్‌ అని అటువంటి కేసీఆర్‌ గురించి మీరు మాట్లాడుతారా అని ఆగ్ర హం వ్యక్తం చేశారు.బీజేపీ పాలిత  రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలను అమలు చేయ డం చేతకాదు కాని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మాత్రం మానుకోరని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత  గ్రామాల్లో ఎటువం టి సౌకర్యా లు కల్పించాలనే తపనతో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధిలో  దూసుకుపోతున్నామన్నారు. ఆడబిడ్డల పెం డ్లిళ్లకు ఇబ్బందులు ఉండవద్దని కల్యాణలక్ష్మి,  రైతులకు  బీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తున్నామన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎవరూ ఊహించని విధంగా వరదకాలువలో 365 రోజులు నీరు ఉండేలా చేసుకున్నామన్నారు.మిషన్‌భగీరథ పథకాన్ని కేంద్ర మంత్రులు, జలవనరులశాఖ అభినందిస్తున్న సందర్భాలు, నీతిఆయోగ్‌ ఈ పథకానికి మన రాష్ర్టానికి రూ.16వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సూ చించినా ఒక్కరూపాయి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారిందని ఎఫ్‌సీఐ వారే చె బుతున్నా వారి బుర్రలకు ఎందుకు ఎక్కడం లేదని ప్రశ్నించారు. 

స్వయంగా రైతు అయిన  కేసీఆర్‌ రై తుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుంటే అబద్ధాలు చెప్పి వారిని ఆగంచేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తే ఇక్కడ నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అడిగే దమ్ములేని వారు కేసీఆర్‌ గురించి మాట్లాడడమా, మోదీ దగ్గర మాట్లాడేందుకు లాగులు తడుపుకునే వారు మరోమారు కేసీఆర్‌ గురించి మాట్లాడితే కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు.  


logo