బుధవారం 27 మే 2020
Nizamabad - Feb 04, 2020 , 01:19:21

మార్చి 4 నుంచి ఇంటర్‌ పరీక్షలు

మార్చి 4 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇందూరు: మార్చి 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి దాసరి ఒడ్డెన్న తెలిపారు. ఈ మేర కు ఇంటర్మీడియెట్‌ బోర్డు షెడ్యూ ల్‌ విడుదల చేసిందని పేర్కొన్నా రు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూ స్‌ పరీక్షను నిర్వహిస్తున్నామని, 30న ఎన్విరాల్‌మెంట్‌ పరీక్షను, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20 వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 


logo