ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Dec 31, 2020 , 02:42:35

చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ

చెత్తతో సేంద్రియ ఎరువు తయారీ

  • స్వచ్ఛభారత్‌ నిర్మల్‌ జిల్లా కన్సల్టెంట్‌ మధుమిత

కుభీర్‌ : గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారుచేసుకొని పంచాయతీలు ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని స్వచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా కన్సల్టెంట్‌ మధుమిత అన్నారు. మండలకేంద్రంలోని సెగ్రిగేషన్‌షెడ్డు ఆవరణలో బుధవారం సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరుచేయడం తద్వారా ఎరువు తయారీ విధానంపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరుగా వేసేలా ముందుగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి, 

అవగాహన కల్పించాలన్నారు. తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌లో ఏడాది పాటు నిల్వ చేసి, ఎరువుగా మారాక రైతులకు అమ్ముకోవాలని సూచించారు. పొడి చెత్తను రీసైక్లింగ్‌ చేసి, ఎరువుగా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో సుముఖం చంద్రశేఖర్‌, ఎంపీవో గోవర్ధన్‌, కుభీర్‌ సర్పంచ్‌ పానాజీ మీరా, పానాజీ విజయ్‌ కుమార్‌, ఏపీవో సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo